కడప ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే…కడప ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలంపై మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. గంజాయి సమూలంగా నిర్మూలనకు చర్యలు చేపట్టాలంటూ ఆదేశాలు ఇచ్చారు నారా లోకేష్. త్రిబుల్ ఐటీలో గంజాయితో లోపలికి వెళ్తు సెక్యూరిటీ కి పట్టుబడ్డ ఇద్దరు విద్యార్థులు సస్పెండ్ కూడా అయ్యారు.
త్రిబుల్ ఐటీ గంజాయి కలకలం కేసులో ఇప్పటి వరకు నలుగురుపై కేసు నమోదు వేశారు. త్రిబుల్ ఐటీ లో మూడవ సంవత్సరం బిటెక్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులతో పాటు కడపకు చెందిన మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. గంజాయి సరఫరా చేసిన చింతకుంట పల్లెకు చెందిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు పోలీసులు. అటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫోన్ తో త్రిబుల్ ఐటీ లో అప్రమత్తమైన అధికారులు…కఠినమైన రూల్స్ అమలు చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.