నెలవారీ లక్ష్యాలు పెట్టుకొని రాబడి సాధించాలి: సీఎం రేవంత్ రెడ్డి

-

ప్రభుత్వ విభాగాల నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ వరకు వచ్చిన ఆదాయం ఆశాజనకంగా లేదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. నిర్ణీత వార్షిక రాబడుల లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నించాలని అధికారులను ఆదేశించారు. గత ఆర్థిక సంవత్సరం కంటే ఎక్కువ ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్టానికి ఆదాయం తెచ్చే ప్రభుత్వవిభాగాలన్ని నెలవారీ లక్ష్యాలు పెట్టుకొని నిర్ణీత రాబడులు సాధించాలని అధికారులకు సూచించారు.

ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చే ఎక్సైజ్, వాణిజ్యపన్నులు, గనులు, రిజిస్ట్రేషన్లు, రవాణాశాఖల అధికారులతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సుమారు 4 గంటలు సమీక్ష నిర్వహించారు. పన్నుల ఎగవేత లేకుండా అన్నివిభాగాలు కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. వార్షిక రాబడుల కోసం నెలవారీ లక్ష్యాలు పెట్టుకొని ఎప్పటికప్పుడు పురోగతిని బేరీజు వేసుకోవాలని సూచించారు.

 

‘GST పెంచుకునేలా వెంటనే చర్యలు చేపట్టాలి. అందుకోసం వాణిజ్య పన్నుల శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి.. పక్కాగా ఆడిటింగ్ చేయాలి. జీఎస్టీ చెల్లింపుల విషయంలో ఎవరినీ ఉపేక్షించవద్దు. నిక్కచ్చిగా పన్ను వసూలు చేయాల్సిందే. పెట్రోలు, డీజిస్‌పై వ్యాట్ ఆదాయం తగ్గినందున.. ప్రత్యామ్నాయంగా ఏవియేషన్ ఇంధనంపై పన్నును సవరించే అవకాశాలు పరిశీలించాలి.’ అని అధికారులను సీఎం ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news