కోపా అమెరికా ఫైనల్ మ్యాచ్ లో.. వెక్కివెక్కి ఏడ్చిన మెస్సీ

-

అర్జెంటీనా స్టార్ ఫుట్​బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ కోపా అమెరికా 2024 ఫైనల్ మ్యాచ్​లో వెక్కివెక్కి ఏడ్చాడు. ఈ మ్యాచ్ లో అర్జెంటీనా విజయం సాధించి 16వసారి టైటిల్ ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మరి మెస్సీ ఎందుకు ఏడ్చినట్టు అనుకుంటున్నారా.. ?కచ్చితంగా అవి విజయానందంలో వచ్చిన ఆనంద భాష్పాలు మాత్రం కాదు. మరి ఏమైందంటే..?

ఈ మ్యాచ్ లో మెస్సీ ఆఖరి వరకూ గ్రౌండ్​లో లేడు. గేమ్ ఫస్ట్ హాఫ్​లో మెస్సీ కుడికాలి చీలమండకి గాయం కావడంతో నొప్పితో విలవిలలాడిన మెస్సీకి వెంటనే ఫిజియోలు చికిత్స అందించారు. ఆ తర్వాత ఆటలోకి దిగిన మెస్సీ  చీలమండ వాపుతో ఉబ్బడంతో తీవ్ర నొప్పికి గురయ్యాడు. ఇక ఫిజియోల సూచన మేరకు మెస్సీ మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్ మెస్సీ కెరీర్​లో ఇదే ఆఖరి మ్యాచ్. దీంతో ఆట ముగిసేదాకా గ్రౌండ్​లో ఉండాలనే ఉద్దేశంతో మెస్సీ బరిలోకి దిగినా..  మధ్యలో గాయం కారణంగా డగౌట్​లో కూర్చోవాల్సి రావడంతో మెస్సీ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. డగౌట్​లో కూర్చోని వెక్కి వెక్కి ఏడ్చాడు. మెస్సీని అలా చూడలేకపోయిన అభిమానులు.. వాళ్లు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు

Read more RELATED
Recommended to you

Latest news