నిరుద్యోగుల మార్చ్‌ పిలుపుతో.. భద్రతావలయంలో సచివాలయం

-

జాబ్‌ క్యాలెండర్‌ విడుదల, మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌, గ్రూప్‌ 2, 3 పోస్టుల పెంపు, డీఎస్సీ పరీక్షల వాయిదా, గ్రూప్‌-1 మెయిన్‌కు 1:100 పద్ధతిలో అభ్యర్థులను పిలవాలనే డిమాండ్లతో నిరుద్యోగులు, ఉద్యోగార్ధులు ఇవాళ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. నిరుద్యోగులంతా కలిసి భారీ ర్యాలీగా సెక్రటేరియట్ కు తరలివెళ్లాలని నిర్ణయించారు. నిరుద్యోగుల మార్చ్ పిలుపుతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే సచివాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.

పెద్ద ఎత్తున విద్యార్థులు, నిరుద్యోగులు తరలిరానున్న నేపథ్యంలో సచివాలయాన్ని పోలీసులు తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. భారీ బందోబస్తు నిర్వహించి బాహుబలి బారికేట్లు ఏర్పాటు చేశారు. ఎవరూ లోపలికి రాకుండా ఇనుప కంచెలు, వాటర్ క్యాన్లు సిద్ధంగా ఉంచారు. మరోవైపు  రాష్ట్ర నలుమూలల నుంచి సచివాలయ ముట్టడికి తరలివస్తున్న విద్యార్థులు, నిరుద్యోగులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు విద్యార్థి, యువజన నాయకులను ముందస్తుగా గృహనిర్బంధంలో ఉంచారు. అశోక్‌నగర్‌, చిక్కడపల్లి ప్రాంతాల్లో అనధికారికంగా 144 సెక్షన్‌ను అమలు చేసి ప్రతి గల్లీలో పహారా కాస్తున్నారు. సెక్రటేరియట్‌కు వచ్చే దా రుల్లో పోలీసులు భారీగా మోహరించారు.

Read more RELATED
Recommended to you

Latest news