గంజాయి, మద్యం మత్తులో నేరాలు చేసే వారిని వదిలిపెట్టం : సీఎం చంద్రబాబు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చిన్నారులపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నంద్యాల జిల్లాలో తొమ్మిదేళ్ల బాలికను ముగ్గురు మైనర్ బాలురు రేప్ చేసి.. హత్య చేసి శవానికి రాయి కట్టి ప్రాజెక్టు వద్ద పడేసిన విషయం తెలిసిందే. మరోవైపు విజయనగరంలో 6 నెలల శిశువును వరుసకు తాత అయ్యే వక్తి అత్యాచారం చేసిన ఘటన కూడా చోటు చేసుకుంది.

చిన్నారులు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. తొమ్మిదేళ్ల బాలికను ముగ్గురు మైనర్ బాలురు రేప్ చేసి చంపేడం ఏంటీ..? సమాజం ఎటు పోతోంది..? కొందరూ ఉన్మాదులుగా మారుతున్నారు. గంజాయి, మద్యం మత్తులో నేరాలు చేసే వారిని వరదలను. చెడు అలవాట్లు ఉంటే మానుకోండి. రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ ఇదే నా హెచ్చరిక అని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news