కావాలనే కాంగ్రెస్ పార్టీ విపక్ష ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలిగిస్తోంది : కేటీఆర్

-

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులను కాలరాసే విధంగా కొత్త సంస్కృతిని తీసుకొచ్చిందని, కావాలనే విపక్ష ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలిగిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆక్షేపించారు.

ప్రోటోకాల్‌ ఉల్లంఘటనలకు సంబంధించి అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ రాశారు. ప్రతి సందర్భంలో ప్రోటోకాల్‌ ఉల్లంఘనలకు పాల్పడుతూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఎన్నుకొన్న ఎమ్మెల్యేలకు స్థానిక నియోజకవర్గంలో జరిగే ఏ పనికి సంబంధించైనా ప్రోటోకాల్‌ ఉంటుంది. కాంగ్రెస్‌ నాయకులు కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అవమానించేలా ప్రోటోకాల్‌ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు అని ,ప్రభుత్వం సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు అందించాల్సిన చెక్కులను స్థానిక ఎమ్మెల్యేలను కాదని, కాంగ్రెస్‌ నాయకులే పంపిణీ చేస్తున్నారు అని పేర్కొన్నారు. హుజూరాబాద్‌, అసిఫాబాద్‌ ,మహేశ్వరం సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చాలా నియోజకవర్గాల్లో ఇలాగే జరుగుతోంది. శాసనసభ్యుల హక్కులు, వారికి ప్రోటోకాల్‌ పరిరక్షణ, గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత శాసనసభాపతిదే”అని లేఖలో కేటీఆర్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news