Health Tips : భోజనం తర్వాత సోంపు తింటున్నారా… ఈ ప్రయోజనాలు కలిగినట్టే?

-

Health Tips: ప్రతిరోజు మనం భోజనం చేస్తున్న తర్వాత తిన్న భోజనం బాగా జీర్ణం అవడం కోసం ఏదైనా పండ్లను తీసుకుంటూ ఉంటాము అయితే భోజనం చేసిన తర్వాత కాసేపటికి అరటి పండు తినటం వల్ల అందులో ఉన్నటువంటి ఫైబర్ జీర్ణ క్రియ రేటును మెరుగుపరచి మనం తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం అవ్వడానికి దోహదపడుతుందని భావిస్తూ ఉంటారు. ఇకపోతే రెస్టారెంట్ కి వెళ్ళిన లేదంటే ఏదైనా ఫంక్షన్లలో కూడా మనం భోజనం చేయగానే తినడానికి సోంపు కూడా అందుబాటులో ఉంచుతూ ఉంటారు.

 

ఇలా భోజనం తర్వాత సోంపు తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి భోజనం తిన్న తర్వాత సోంపు తినటం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఏంటి అనే విషయానికి వస్తే… సోంపులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఇందులో ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, జింక్ కాపర్ వంటి ఖనిజాలు ఎంతో పుష్కలంగా లభిస్తాయి. ఇక సోంపులో ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది.

ఇలా ఈ సోంపులో ఎన్ని ప్రయోజనాలు ఉండటం చేత భోజనం తిన్న తర్వాత కాస్త సోంపు తినటం వల్ల మన జీర్ణ క్రియా రేటును మెరుగుపరచడమే కాకుండా మనం తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం అవ్వడానికి కారణం అవుతుంది. గ్యాస్, అజీర్తి వంటి సమస్యల నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా భోజనం తర్వాత మన నోరు మసాలా వాసన రాకుండా చాలా తాజాగా ఉంటుంది. ఇక రక్తంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని కూడా పెంపొందింప చేస్తుంది. ఇకపోతే మన శరీరంలో రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి కూడా సోంపు కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news