తెలంగాణ సచివాలయానికి ఇంటర్నెట్ సేవల్లో అంతరాయం..!

-

తెలంగాణ సచివాలయంలో రెండు గంటలకు పైగా ఇంటర్ నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో  పలు శాఖల సేవలు నిలిచిపోయాయి.  ఇంటర్నెట్ రావడం లేదు  అంటూ ఉద్యోగుల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిపుణ నెట్ వర్క్స్ సంస్థ పర్యవేక్షణలో ఇంటర్నెట్ సేవలు అందుతున్నాయి. అయితే ఆ సంస్థకు కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉండడంతోనే ఇంటర్నెట్ సేవలు నిలిపి వేసినట్టు సెక్రటేరియట్ లో చర్చలు జరుగుతున్నాయి.

కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ జరుగుతున్న సందర్భంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం గమనార్హం. సుమారు 350 కోట్లకు వర్క్ చేజిక్కించుకున్నది ఈ ప్రైవేటు కంపెనీ. గడిచిన 18 నెలలుగా బిల్లులు పెండింగ్  ఉన్నట్లు సమాచారం..? గత కొన్ని రోజులుగా ప్రభుత్వాన్ని ఇంటర్నెట్ బిల్లులు అడుగుతూ వచ్చింది నిపుణ నెట్ వర్క్. అయితే తెలంగాణ సీఎం కీలక మీటింగ్ సందర్బంగా ఇవాళ సీఎం దృష్టికి తీసుకెళ్ళాలనే ఇంటర్నెట్ సేవలు నిలిపివేసినట్లు సెక్రటేరియట్ లో చర్చ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news