కల్తీ ఎరువులు, విత్తనాల విషయంలో సీఎం రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఎక్కడా రాజీపడొద్దని ముఖ్యమంత్రి రేవంత్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నది బాధితులతోనే కానీ నేరస్తులతో కాదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను ఆదేశించారు. డ్రగ్స్ విషయంలో అధికారులు సమన్వయం చేసుకొని పనిచేయాలన్నారు.
కల్తీ పురుగు మందులు, ఎరువులు, విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలి. కొన్నిసార్లు కృత్రిమ కొరత సృష్టించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తారని, అటువంటివి జరగకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించారు.అటవీ భూముల్లో పండ్ల మొక్కలు నాటడాన్ని ప్రోత్సహించి తద్వారా గిరిజనులకు ఆదాయం పెంచాలి. ప్రాజెక్టు కట్టలు, కాలువ గట్టులు, రహదారుల వెంట తాటి, ఈత చెట్లు నాటాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వసతిగృహాలు ఒకేచోట ఉండేందుకు వీలుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటునకు స్థలాలు ఎంపిక చేయాలి అని ఆదేశించారు.