నేడు రూ.లక్షలోపు రైతు రుణాలు మాఫీ

-

తెలంగాణ రైతులకు శుభవార్త. అన్నదాతలకు రుణమాఫీ పథకం ఈరోజు (జులై 18వ తేదీ) ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు సచివాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికల్లోని రైతులతో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.లక్ష లోపు రుణాల మాఫీని లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం 11.50 లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లో రూ.లక్ష వరకు జమవుతాయి.

మరోవైపు ఈరోజు ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించి రుణమాఫీ మార్గదర్శకాల అమలుపై దిశానిర్దేశం చేస్తారు. రుణమాఫీ కోసం అవసరమైన నిధులను ఆర్థికశాఖ బుధవారం బ్యాంకులలో జమ చేసింది. రూ.లక్ష లోపు రుణమాఫీ వర్తించే రైతుల జాబితాలను ప్రభుత్వం అన్ని జిల్లాల వ్యవసాయాధికారులకు పంపించింది. స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు అభ్యుదయ రైతులను, లబ్ధిదారులను రైతువేదికల వద్దకు ఆహ్వానించారు. మాఫీ నిధులు రుణఖాతాల్లో జమ అయ్యాయనే సమాచారం ఫోన్‌లో వచ్చిన వెంటనే ఆయా రైతులను మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news