నేడు అక్టోబర్‌ నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

-

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం పలు ఆర్జిత సేవలను ప్రవేశపెట్టింది. అందుకు సంబంధించిన టికెట్లను మూడు నెలలు ముందుగానే ఆన్లైన్లో విడుదల చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే అక్టోబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి గదుల బుకింగ్కు సంబంధించిన శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లను ఇవాళ (జులై 18వ తేదీన) ఉదయం 10 గంట‌ల‌కు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఉదయం 10 నుంచి జులై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వెల్లడించింది. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన భక్తులు జులై 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు నగదు చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాలని పేర్కొంది.

కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ల కోటాను జులై 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన టికెట్లను అదే రోజు (జులై 22) మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తారు. అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టికెట్లను ఈ నెల 23న ఉదయం 10 గంటలకు .. శ్రీవాణి ట్రస్టు టికెట్ల బుకింగ్‌ను జులై 23న ఉదయం 11 గంటలకు అందుబాటులో ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news