రుణమాఫీ అయిన రైతులకన్నా.. కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ: కేటీఆర్‌

-

ఊరించి.. ఏడు నెలలు ఏమార్చి చేసిన రుణమాఫీ తీరు చూస్తే చారాణ కోడికి బారాణ మసాలా అన్నట్లు ఉందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రుణమాఫీ ప్రక్రియపై ఎక్స్ వేదికగా ఆయన విమర్శలు గుప్పించారు. ‘సీఎం గారు… ఊరించి.. ఊరించి.. ఏడునెలలు ఏమార్చి చేసిన..రుణమాఫీ తీరు చూస్తే.. “ చారాణ కోడికి..! బారాణ మసాలా…!! ” అన్న సామెత తెలంగాణ ప్రజలకు గుర్తొస్తోంది. రుణమాఫీ అయిన రైతులకన్నా.. కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కు. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు..! రైతుమాఫీ పథకానికి మరణ శాసనాలు అయ్యాయి. అని కేటీఆర్ విమర్శించారు.

అన్నివిధాలా అర్హత ఉన్నా.. ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పేవారు లేరని, రైతులు గోడు చెప్పుకుందామంటే వినేవారు లేరని కేటీఆర్ అన్నారు. అర్హులైన లబ్దిదారులు.. రుణమాఫీ కాక అంతులేని ఆందోళనలో ఉంటే ఎందుకీ సంబురాలని ప్రశ్నించారు. నలభై లక్షల మందిలో మెజారిటీ రైతులకు నిరాశే మిగిల్చినందుకా ? అని ప్రశ్నించారు. ముప్ఫై లక్షల మందిని మోసం చేసినందుకా ? అని కేటీఆర్ అడిగారు.

Read more RELATED
Recommended to you

Latest news