వర్షాలు కురుస్తునందున రోడ్డు మార్గాన వినుకొండ బయలుదేరారు జగన్. అయితే.. ఈ తరుణంలోనే… వై ఎస్ జగన్ వెంట పార్టీ నేతలు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. వై ఎస్ జగన్ తో పాటు వినుకొండ బయలుదేరారు మాజీ మంత్రులు, ఎంపీలు,.ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు. ఎక్కడికక్కడ నేతల కార్లు వై ఎస్ జగన్ వెంట వెళ్లకుండా నియంత్రిస్తున్నారు పోలీసులు.
తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు లో పార్టీ నేతల వాహనాలు ఆపేపారు పోలీసులు. ఇన్నాళ్లు ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తొలగించారు పోలీసులు. సరిగ్గా నడవని బీపీ వాహనం ఇచ్చారు పోలీసులు. వాహనం బాగోకపోవడం తో ప్రయివేటు వాహనం లో వినుకొండ వెళ్తున్నారు వై ఎస్ జగన్. పోలీసులు తీరుపై మండి పడుతున్నారు వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. కాగా, బుధవారం రాత్రి హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు.