పెద్దిరెడ్డికి 1000 సంవత్సరాలు సరిపడా ఆస్తులు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు బుద్దా వెంకన్న. పుంగనూరు ప్రజలు పెద్దిరెడ్డిని నియోజకవర్గంకు రాన్వివరని…హెచ్చరించారు. చంద్రబాబు పుంగనూరు దాడి చేశారు అని చెప్తున్నారు… మీ నియోజకవర్గం లో మీ మీద దాడి చేసేది మీ వైసీపీ కార్యకర్తలేనని చురకలు అంటించారు.
నారా లోకేష్ రెడ్ బుక్ చూస్తే నే మీరు బయపడుతున్నారు… అదే రెడ్ బుక్ ఓపెన్ చేస్తే మీ పరిస్థితి ఏంటి అంటూ హెచ్చరించారు బుద్దా వెంకన్న. ఇది ఇలా ఉండగా వైసీపీ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్పలకు బిగ్ షాక్ ఇచ్చారు ఏపీ పోలీసులు. వైసీపీ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్పలపై కేసులు పెట్టారు పోలీసులు. చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన టీడీపీ, వైసీపీ పరస్పర దాడుల్లో పోలీసులు కేసులు నమోదు చేశారు. టీడీపీ నాయకుడు సుహేల్ బాషా ఫిర్యాదు మేరకు హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు.