కూటమి ప్రభుత్వం లో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తాాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముచ్చుమర్రి ఘటనపై హోమంత్రి వంగలపూడి అనిత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు పోలీసులు ముచ్చుమర్రి బాలిక కేసును ఛేదించలేదని.. రాష్ట్రంలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల ఎందుకు వాయిదా వేశారని ప్రశ్నించారు.
శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముచ్చుమర్రి బాలిక మృతదేహాన్ని ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారో చెప్పాలి. ఈ కేసులో నిందితుడుని, దళిత వ్యక్తిని లాకప్ లో వేసి పోలీసులు దారుణంగా కొట్టడంతో అతను చనిపోయాడు. ఇది లాకప్ డెత్.. ప్రభుత్వ హత్య. ఈ దారుణం పై దళిత సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు. మరోవైపు రషీద్ కుటుంబాన్ని టీడీపీ నేతలు ఎందుకు పరామర్షించలేదన్నారు. వైసీపీ నేతలపై కేసులు పెట్టడమే టీడీపీ పనిగా పెట్టుకుందని.. ఫస్ట్ మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి అని పేర్కొన్నారు అంబటి రాంబాబు.