రాష్ట్రంలో ఏపార్టీకీ లభించని గొప్పవరం.. అధికారవైసీపీకి లభించింది. ఇతర పార్టీల్లో చెప్పుకోదగ్గ రేంజ్‌లో ఫైర్ బ్రాండ్లుగా గుర్తింపు పొందిన నాయకులు లేరు. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో ఈ కొరత చాలా ఉంది. స్పాంటేనియస్‌గా అప్పటికప్పుడు ఎదుటి పక్షంపై దుమ్మురేపే రేంజ్‌లో కామెంట్లు కుమ్మరించే నాయకులు లేరనే చెప్పాలి. ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూ.. ఎప్పటిక ప్పుడు మాటల తూటాలు పేలుస్తూ.. వార్తల్లో వ్యక్తులుగా నిలిచే నాయకులు ఎక్కువగా ఉన్నది వైసీపీలోనే. ఒకరు కాదు ఇద్దరు కాదు.. దాదాపు జిల్లాకు ఒకరు చొప్పున ఇలాంటి నాయకులు ఉన్నారు.
అయితే, వీరిలోనూ ప్రముఖంగా మీడియాలో వ్యక్తు లుగా గుర్తింపు తెచ్చుకున్నారు కొందరు ఉన్నారు.
ఇలాంటి వారిలో చిత్తూరు జిల్లాకు చెందిన రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, నెల్లూరుకు చెందిన కాకాణి గోవర్ధన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి కొడాలి నాని, తూర్పు గోదావరికి చెందిన మంత్రి కురసాల కన్నబా బు, శ్రీకాకుళానికి చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వంటివారు ఫైర్ బ్రాండ్లుగా చలామణిలో ఉన్నారు. వీరు ఏం మాట్లా డినా వార్తే. వారు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా.. కూడా సంచలనమే.
అయితే, ఇప్పుడు కీలక సమయంలో అందునా.. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో అన్ని వైపుల నుంచి అమరావతి విషయం సహా.. మూడు రాజధానుల విషయంపై తీవ్ర విమర్శలు వస్తున్న నేప థ్యంలో వీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? అనేది కీలక ప్రశ్న. వీరిలో ఎవరూ కూడా ఇప్పటి వరకు స్పందించింది లేదు. వాస్తవానికి పైన చెప్పుకొన్నవారు ఎలాంటి నేతకైనా సమాధానం చెప్ప గల నాయకులే. ఆచితూచి అడుగులు వేసేవారు సహా .. కౌంటర్లు ఇచ్చేవారుగా కూడా వీరికి మంచి పేరుంది. అలాంటి వారు ఇప్పుడు మౌనం ఎందుకు వహిస్తున్నారు? అసలు ఏం జరిగింది? అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలిస్తే.. పార్టీ అధినేత, సీఎం జగన్ నుంచే వీరికి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని అంటున్నారు.
ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యాఖ్యలు వస్తున్నాయని, వీటికి కౌంటర్లు ఇవ్వడం ప్రారంభిస్తే.. ఈ విషయం మరింత ఫోకస్ అవుతుందని, కాబట్టి ప్రభుత్వం పై దాడి జరుగుతున్నా.. ఓ వర్గం ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సో.. ఫైర్ బ్రాండ్లు ఎవరూ కూడా నోరు మెదప రాదని, వివాదాన్ని పెద్దది చేయొద్దని జగన్ స్వయంగా మౌఖిక ఆదేశాలు ఇచ్చారని అంటున్నారు. సో.. దీంతో ఫైర్ బ్రాండ్లు అమరావతి సహా రాజధానుల అంశంపై గుంభనంగా ఉండడానికి తెర వెనుక ఉన్న ప్రధాన రీజన్ ఇదేనని తెలుస్తోంది.