ఏపీ శాసనసభలో జనసేన డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా నాదెండ్ల మనోహర్‌గా నియమిస్తున్నట్లు స్పీకర్‌కి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమాచారం ఇచ్చారు.జనసేన పార్టీ చీఫ్ విప్‌గా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, కోశాధికారిగా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, కార్యదర్శులుగా ఎమ్మెల్యేలు దేవ వరప్రసాద్, వంశీకృష్ణ శ్రీనివాస్ ను నియమించారు. మరోవైపు, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ ఈ నెల 28 వరకు జరగనుంది. జనసేన కార్యకర్తలు సభ్యత్వ నమోదు చేయిస్తున్నారు. పార్టీ వాలంటీర్లను ఈ ప్రక్రియ కోసం ఎంపిక చేశారు. సభ్యత్వ నమోదు కోసం యాప్ వాడుతున్నారు.
గత సంవత్సరం మొత్తం 6.47 లక్షల మంది క్రియాశీలక సభ్యులు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అంతకంటే ఎక్కువ నమోదు చేయలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో జనసేనకు భారీగా సీట్లు రావడంతో పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. హెల్ప్ లైన్లనూ అందుబాటులో ఉంచారు.