ఫ్యాన్సీ నంబర్ క్రేజ్.. TG09A9999కు అత్యధికంగా రూ.19 లక్షలు

-

చాలా మంది వాహనదారులు తన నంబర్ ప్లేట్పై ఏదో ర్యాండమ్ నంబర్ కాకుండా ఫ్యాన్సీ నంబర్ ఉండాలని ఇష్టపడుతుంటారు. కొన్నిసార్లు ఆ ఫ్యాన్సీ నంబర్ కోసం ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆ స్తోమత లేని వారు తమ పుట్టిన రోజు, పెళ్లి రోజు, లేదా ఏదైన ప్రత్యేక రోజు, లేదా తమకు లక్కీ నంబర్ ఆ ప్లేట్లో ఉండేలా చూసుకుంటారు. కానీ కొంతమంది మాత్రం ఖర్చు ఎంతైనా తాము అనుకున్న ఫ్యాన్సీ నంబర్ దక్కించుకోవడానికి వెనకాడరు.

అలా ఫాన్సీ నంబర్లపై తెలంగాణ వాహన యాజమానుల్లో ఆసక్తి రోజురోజుకు పెరిగిపోతోంది. తమకు ఇష్టమైన అచ్చొచ్చే నంబర్లను దక్కించుకోవడానికి ఎంత చెల్లించడానికైన వెనుకాడటం లేదు. హైదరాబాద్‌లోని  ఖైరతాబాద్‌ రవాణా కార్యాలయంలో బుధవారం రోజున జరిగిన వేలంలో…TG 09 A 9999 నంబర్‌కు ఏకంగా…..19 లక్షల 51వేల 111 రూపాయలు ధర పలికింది. హానర్స్‌ డెవలపర్స్‌ అనే సంస్థ ఈ నంబర్‌ను సొంతం చేసుకుంది. కొత్తగా ప్రారంభమైన TG 09 B 0001 నంబర్‌ను …..8లక్షల 25 వేలు చెల్లించి NG మైంజ్‌ ఫ్రేమ్‌ సంస్థ దక్కించుకుంది. అదే సిరీస్‌లోని 0009 నంబర్‌ను 6లక్షల66వేల 666 రూపాయలు చెల్లించి అమరం అక్షరరెడ్డి సొంతం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news