చంపేస్తే.. నన్ను చంపేయండి అంటూ మాజీ సీఎం జగన్ హాట్ కామెంట్స్ చేశారు. చంపేస్తే.. నన్ను చంపేయండి కానీ టీడీపీకి ఓటు వేయని ప్రజలను, వైసీపీ కార్యకర్తలను కాదన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ హింసకు ఆయన వారసుడు నారా లోకేష్, చంద్రబాబు నాయుడే కారణమని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.
తన నిరసనలో భాగంగా ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు నాయుడు ఎందుకు ఇలా చేస్తున్నారో స్పష్టంగా అర్థమైందని.. ప్రజలకు స్వర్గం, చంద్రుడు అంటూ వాగ్దానం చేశారని, అవి అబద్ధాలని బాగా తెలుసు. వాగ్దానాలు నెరవేరడం లేదు.” దీన్ని ఖండించకుంటే రేపు మనం అధికారంలో ఉన్నప్పుడు ఇదో కొత్త ట్రెండ్ అవుతుంది.. మనం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేయలేదు.. శాంతిభద్రతలు క్షీణించాయని ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అన్నారు జగన్.