కేటీఆర్ ఇలాకలో దారుణ పరిస్థితులు.. నేడు సిరిసిల్ల బంద్‌ !

-

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత… రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ పరిస్థితిలు నెలకొన్నాయి. నేతన్న కార్మికుల బతుకులు.. ఆగమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే… బతుకమ్మ చీరల ఆర్డర్ నిలిపివేసింది. దీంతో చాలామంది సిరిసిల్ల నేతన్నలు రోడ్డున పడ్డారు. గులాబీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో.. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో నేతన్నలు చేతినిండా పనితో బతికారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.

దీంతో నీతనలు ఇవాళ సిరిసిల్ల బంద్ కు పిలుపునిచ్చారు. ఇవాళ ఉదయం నుంచి సిరిసిల్లలో బంద్ వాతావరణ స్పష్టంగా కనిపిస్తోంది. ఇక అటు సిరిసిల్ల పట్టణం అంబేద్కర్ చౌక్ వద్ద నేతన్నల నిరాహార దీక్షలు, కొనసాగుతున్నాయి. మూడవ రోజు వర్షంలో సైతం దీక్షలో కూర్చున్నారు నేతన్నలు. విద్యుత్ మరియు ఉపాధి సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. బతుకమ్మ చీరల ఆర్డర్‌ కూడా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. కార్మికులకు సంఘీభావం తెలుపుతున్నాయి పలు పార్టీల నాయకులు మరియు కార్మిక సంఘాలు.

Read more RELATED
Recommended to you

Latest news