గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.వచ్చే నెల(ఆగస్టు)లో సిలిండర్ ధరను ప్రభుత్వం తగ్గించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.హిందూస్తాన్ పెట్రోలియం,ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వంటి సంస్థలు ప్రతి నెలా 1వ తేదీన గ్యాస్ ధరలపై సమీక్ష నిర్వహిస్తుంటాయి.
డొమెస్టిక్ లేదా కమర్షియల్ గ్యాస్ సిలెండర్ల ధరల్ని తగ్గించడం లేదా పెంచడం లేదా ఏ మార్పు లేకుండా చేయడం వంటి వాటిపై సమీక్షలు చేస్తాయి. అయితే ఇటీవల జూలై 1న జరిగిన సమీక్షలో వంట గ్యాస్ ధరల్లో ఏ మార్పు చేయలేదు. కానీ అంతకుముందు నెలలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను ప్రభుత్వం తగ్గించిన సంగతి తెలిసిందే.