మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రమాదం కాదు. కుట్రలో భాగంగానే ఫైళ్లను తగులబెట్టారు అని రెవెన్యూ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా పేర్కొన్నారు. ఫైళ్లపై ఏదో కెమికల్ చల్లారు. కెమికల్ చల్లకుండా ఇంత పెద్ద ఎత్తున ఫైళ్లు త్వరగా దగ్దం కావు. కానీ మదనపల్లె ఫైల్స్ ఘటనలో కేవలం 17 నిమిషాల్లో ఫైళ్లన్నీ దగ్దదం అయ్యాయి. ఎమ్మార్వో సంతకం ఫోర్జరీ చేశారు.. ఆ ఫైళ్లను దగ్దం చేశారనే ఆరోపణ ఉంది. 14 వేల ఎకరాల చుక్కల భూములను ప్రైవేట్ వ్యక్తులకే ఇచ్చారు.. ఇదెలా సాధ్యం..?
ఈ ఘటనలో మొత్తం మొత్తం 2200 ఫైళ్లను దగ్దం చేశారు. సీసీ కెమెరాలు పని చేయడం లేదు. అనుమానస్పద రీతిలో మాజీ ఆర్డీవో వచ్చారు. అక్రమాల్లో మాజీ ఆర్డీవో, ప్రస్తుత ఆర్డీవో ప్రమేయం ఉందని నిర్ధారణకు వచ్చాం. అందుకే ముగ్గుర్నీ సస్పెండ్ చేశాం. ఎంతటి వారైనా సరే ఫైళ్ల దగ్దం ఘటనలో వదిలిపెట్టం అని స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా తెలిపారు.