కేసీఆర్ రికార్డు బ్రేక్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్. మంగళవారం ఉదయం 3:15 అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ….మంగళవారం ఉదయం 3:15 వరకు కొనసాగింది.
సోమవారం సాయంత్రం 4.40 నుండి 5. 50 వరకు టీ బ్రేక్ ఇచ్చారట. గతంలో 12 గంటల వరకు సభ నడిపింది కేసీఆర్ సర్కార్. ఇప్పుడు ఆ రికార్డు బ్రేక్ చేసింది రేవంత్ సర్కార్. కాగా, రాత్రి అసెంబ్లీలో భట్టి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నైన నేను చీఫ్ పబ్లిసిటీ కోసం ఆరాట పడే స్థాయిలో లేము మాకు ఆ ఆలోచన కూడా లేదన్న విషయాన్ని ప్రతిపక్షాలు గ్రహించాలి. ప్రతిపక్షాలకు కూడా అలాంటి ఆలోచన ఉండకూడదన్నారు. 2014 నాటికి 778 మెగావాట్ల కరెంటును 11705 మెగా వాట్ల కు పెంచామని బిఆర్ఎస్ గొప్పలు చెప్పడం విడ్డూరం అన్నారు. బీఆర్ఎస్ పాలనల్లో కరెంటు ఉత్పత్తి పెరిగితే కట్టిన పవర్ ప్రాజెక్టులు కండ్లకు కనిపించేవి కదా? అంటూ ప్రశ్నించారు భట్టి.