బాయ్‌ఫ్రెండ్‌తో షికారు.. ఒలింపిక్స్‌ నుంచి బ్రెజిల్ స్విమ్మర్ ఔట్‌..!

-

ఒలింపిక్స్కు వెళ్లాలనేది ప్రతి క్రీడాకారుడి లైఫ్లో అతి పెద్ద లక్ష్యం. విశ్వవేదికపై మెరిసి తమ దేశానికి పతకం సాధించాలని ప్రతి ప్లేయర్ ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడుతుంటారు. కానీ అలా లక్కీఛాన్స్ వచ్చిన ఓ స్విమ్మర్ మాత్రం తన నిర్లక్ష్యంతో ఆ అవకాశం పోగొట్టుకుంది. బాయ్ఫ్రెండ్తో నైట్ ఔట్ చేసి ఏకంగా ఒలింపిక్స్ నుంచే ఔట్ అయింది.

అసలేం జరిగిందంటే?

బ్రెజిల్‌ స్విమ్మర్ అనా కరోలినా వియెరా తన బాయ్‌ఫ్రెండ్‌, క్రీడాకారుడు అయిన గాబ్రియేల్ శాంటోస్‌తో శుక్రవారం రాత్రి బయటకు వెళ్లి మరుసటి రోజు టోర్నీ ప్రదేశానికి వచ్చింది. ఆమె సోషల్‌ మీడియాన పోస్ట్‌ ద్వారా ఈ విషయం తెలుసుకున్న బ్రెజిలియన్ ఒలింపిక్ కమిటీ ముందస్తు అనుమతి తీసుకోకుండా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో ఆమెను ఒలింపిక్స్‌ టోర్నీ నుంచి తొలగించి స్వదేశానికి పంపించింది. గాబ్రియేల్ శాంటోస్‌ తనను క్షమించాలని కమిటీని వేడుకోవడంతో అతడికి అవకాశం ఇచ్చింది. కానీ శనివారం జరిగిన పురుషుల 4×100 ఫ్రీస్టైల్ హీట్స్‌లో శాంటోస్ ఓడిపోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news