కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించేందుకు నిత్యం దేశం నలుమూలల నుంచి వేలాది భక్తులు తరలివస్తుంటారు. చాలా మంది కాలి నడక ద్వారా ఏడుకొండలు ఎక్కి మొక్కులు చెల్లించుకుంటారు. భక్తితో తిరుమలేశునికి తలనీలాలు సమర్పిస్తారు. ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తుల రాకతో తిరుమల సందడిగా మారుతుంది.
ఈ క్రమంలో తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. వారికి కావాల్సిన సదుపాయాలను టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు మంగళవారం రోజున తిరుమల శ్రీవారిని 69,937 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,978 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీకి మంగళవారం రోజున మొత్తం రూ.4.58 కోట్ల ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు తెలిపారు. పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు.