మేం రెవెన్యూ మిగులుతో రాష్ట్రాన్ని అప్పగిస్తే.. మీరు అప్పు తెచ్చి జీతాలిస్తున్నారు : కేటీఆర్

-

తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు తిరిగి ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి సమావేశాల్లో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిగులు బడ్జెట్‌లో అప్పగిస్తే అప్పుల కుప్పగా ఇచ్చారని పదేపదే విమర్శిస్తున్నారని మండిపడ్డారు.

2014లో తెలంగాణ రెవెన్యూ మిగులు రూ.369 కోట్లు అని.. 2022-23 రెవెన్యూ మిగులు రూ.5,944 కోట్లు అని.. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం బడ్జెట్‌లో రెవెన్యూ మిగులు 209 కోట్లు అని తెలిపారు. అప్పటి కాంగ్రెస్‌ తమకు రూ.369 కోట్లతో అప్పగిస్తే.. తాము రూ.5,944 కోట్ల రెవెన్యూ మిగులుతో అప్పగించామని చెప్పారు. అలా అప్పగించినా జీతాలు ఇచ్చేందుకు అప్పులు తెస్తున్నామని ఆర్థిక మంత్రి చెబుతున్నారని విమర్శించారు.

“రాష్ట్రం ఏర్పాడిన తర్వాత ఉత్పత్తులు, సంపద పెరిగిందని భట్టి విక్రమార్క సభలో చెప్పారు. తెలంగాణ.. దేశానికి ఎకనామిక్‌ ఇంజిన్‌ అని శ్రీధర్‌బాబు చెప్పారు. రాష్ట్ర పురోగతిపై వాస్తవాలు చెప్పినందుకు మంత్రులను అభినందిస్తున్నాను. ఉద్యమాలకు ఉదయించిన తెలంగాణ ఇప్పుడు ఉజ్వలంగా వెలుగుతోంది.” అని కేటీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news