అంగన్‌వాడీ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్ వాడీలకు పదవీ విరమణ తర్వాత ప్రయోజనాలను అందిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. అంగన్ వాడీ టీచర్ కు రెండు లక్షల రూపాయలు రిటైర్మ్‌మెంట్ బెనిఫిట్స్ అందుతాయని తెలిపారు. అంగన్ వాడీ హెల్పర్ కు రిటైర్ అయిన తర్వాత లక్ష రూపాయలు అందచేస్తామని మంత్రి సీతక్క తెలిపారు.
ఇటీవలే అంగన్ వాడీ టీచర్లకు, వర్కర్లకు వేతనాలు పెంచాలని.. రిటైర్ మెంట్ తరువాత బెనిఫిట్స్ కల్పించాలని ధర్నా చేసిన విషయం తెలిసిందే. అయితే టీచర్లు, కార్యకర్తలకు మంత్రి సీతక్క తాజాగా గుడ్ న్యూస్ చెప్పారు. రిటైర్ అయ్యే టీచర్లకు ప్రస్తుతం రూ.1లక్ష ఇస్తుండగా.. ఇక నుంచి రూ.2లక్షలు ఇవ్వనున్నట్టు తెలిపారు. అదేవిధంగా కార్యకర్తలకు ప్రస్తుతం రూ.50వేలు ఇస్తుండగా.. ఇక నుంచి రూ.1లక్షకు పెంచి ఇస్తామని వెల్లడించారు మంత్రి సీతక్క. ఈ ప్రతిపాదనలను ఇప్పటికే ఆర్థిక శాఖకు పంపినట్టు తెలిపారు. ప్రస్తుతం రిటైర్డ్ అయ్యే టీచర్లకు ఇది వర్తిస్తుందా లేదా అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు.