సిరాజ్‌కు విద్యార్హత లేకున్నా గ్రూప్‌-1 ఉద్యోగం ఇస్తున్నాం: సీఎం

-

తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు చివరి రోజు కొనసాగుతున్నాయి. ఇవాళ్టి సమావేశాల్లో మాట్లాడుతూ..క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నిఖత్ జరీన్‌కు ఆర్థిక సాయం చేశామని.. ఇంటిస్థలం కేటాయించామని తెలిపారు. సిరాజ్‌కు విద్యార్హత లేకున్నా గ్రూప్‌-1 ఉద్యోగం ఇస్తున్నామని వెల్లడించారు. నిఖత్, సిరాజ్‌… రాష్ట్రానికి, దేశానికి మంచిపేరు తెచ్చారని.. క్రీడాకారులకు అన్ని విధాలుగా తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో త్వరలో క్రీడా విధానం తెస్తున్నామని పేర్కొన్నారు. హరియాణా క్రీడా విధానం పరిశీలిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లో మరో క్రికెట్ మైదానం వస్తుందని చెప్పారు. యూసుఫ్‌గూడ, గచ్చిబౌలి, సరూర్‌నగర్‌ స్టేడియాల్లో క్రీడలు తగ్గాయన్న రేవంత్ రెడ్డి.. ఎల్‌బీ స్టేడియంలో క్రీడలు తగ్గాయి.. రాజకీయ కార్యకలాపాలు పెరిగాయని వ్యాఖ్యానించారు.   అసెంబ్లీ సమావేశాల అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఎల్‌బీ స్టేడియంలో జరిగే సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. పదోన్నతులు పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయుల సభలో పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news