లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే నో జ‌రిమానా.. కానీ..

-

సాధార‌ణంగా హెల్మెట్‌, లైసెన్స్‌ లేకుండా వాహనంతో రోడ్డెక్కితే జరినామా విధిస్తున్నారు పోలీసులు. అయితే ఇక నుంచీ వాహనదారులు లైసెన్స్‌ లేకుండా వాహనం నడిపితే నో జ‌రిమానా. అయితే.. ఇప్ప‌టి వరకు జరిమానాలతో సరిపెట్టినట్టు కాకుండా ఇకపై నేరుగా జైలుకే పంపాలని నిర్ణయించింది. అసలు విష‌యంలోకి వెళ్తే.. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ రవాణాశాఖ నిర్ణయించింది. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 88,872 మంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. ఈ గణాంకాల ఆధారంగా రూపొందించిన నివేదికను రోడ్ సేఫ్టీపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీకి రవాణా శాఖ సమర్పించింది.

పరిశీలించిన కమిటీ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డెక్కే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేయాలని నిర్ణయించిన రవాణా శాఖ.. రోడ్డు ప్రమాదాలను ఈ ఏడాది 20 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా డ్రైవింగ్‌ లైసెన్సుల తనిఖీలను ముమ్మరం చేసింది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడితే ఇంతకుముందులా జరిమానాలతో సరిపెట్టకుండా నేరుగా జైలుకే పంపాలని నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Latest news