నిందలు వేయడం తప్పా.. BRSకి ఏం తెలియదు..!

-

తెలంగాణ ప్రజలు సోనియాగాంధీ, రాహూల్ గాంధీల నాయకత్వంలో 8 నెలల క్రితం అధికారం ఇచ్చారు. అయితే గత పదేళ్ళలో అసెంబ్లీ సమావేశాలు ఎలా జరిగాయి..రేవంత్ సీఎం అయ్యాకా ఎలా నడుస్తున్నాయో చూడండి అని మీడియా సమావేశంలో జగ్గారెడ్డి అన్నారు. ప్రతిపక్షాలు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు. కోమటిరెడ్డి.. సంపత్ లను సభ నుండి సస్పెండ్ చేశారు. 8 నెలల్లో మూడు సార్లు.. నెల రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నడిచాయి. అసెంబ్లీ సమావేశాలు రేవంత్ హయంలో హుందాగా నడుస్తున్నది.

కానీ కేసీఆర్ ఒక్కసారి వచ్చారు సభకు. హరీష్, కేటీఆర్ లు అధికార పార్టీ కంటే ఎక్కువ సమయం సభలో మాట్లాడారు. ఇంత ప్రజాస్వామ్య బద్దంగా ఉన్నా.. నిందలు వేస్తున్నారు. అయితే నిందలు వేయడం తప్పా.. BRSకి ఏం తెలియదు. మూసిని సుందరీకరణ చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పుడు మూసి ప్రక్షాళన డబ్బుల కోసమే అంటున్నారు బీజేపీ నేతలు. చేస్తే డబ్బుల కోసం అంటారు..చేయకపోతే చేయడం లేదు అంటారు అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news