నేను టీటీడీ టిక్కెట్లు అమ్ముకోలేదని కుప్పం అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి, MLC భరత్ పేర్కొన్నారు. తాజాగా గుంటూరులో వైసీపీ ఎమ్మెల్సీ భరత్‍పై కేసు నమోదు అయిందని.. భరత్ PRO మల్లిఖార్జున్ పై కూడా కేసు నమోదు అయినట్టు వార్తలు వచ్చాయి. తిరుమల దర్శనం సిఫారసు లేఖలు, తోమాల సేవకు గుంటూరు వాసుల నుంచి రూ.2.8 లక్షలు వసూలు చేసారని ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్సీ భరత్ పై ఫిర్యాదు టీడీపీ నేత చిట్టిబాబు ఫిర్యాదు చేశారు.
దీనిపై తాజాగా ఆయన స్పందించారు. తాను టీటీడీ దర్శనం టికెట్లను అమ్ముకున్నానని వస్తున్నటువంటి వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఎమ్మెల్సీ భరత్ వెల్లడించారు. అసలు టికెట్లు అమ్ముకొని బతకాల్సిన పరిస్థితిలో తాను లేనని స్పష్టం చేశారు. తన తండ్రి ఉన్నత స్థానంలో ఉన్నారని.. తాను కూడా అలాగే కొనసాగుతున్నానని పేర్కొన్నారు. టికెట్లు అమ్ముకున్నట్టు నాపై టీడీపీ నాయకుడు ఫిర్యాదు చేయడం చాలా ఆశ్యర్యంగా ఉందని.. చంద్రబాబు పై పోటీ చేయడంతోనే కక్ష కట్టి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు భరత్.