ఏపీలో యూట్యూబ్‌ అకాడెమీ!.. కంపెనీ సీఈఓతో సీఎం చంద్రబాబు వర్చువల్ మీటింగ్

-

ఏపీ రాజధాని అమరావతికి యూట్యూబ్ అకాడమీ రానుంది. అమరావతిలోని మీడియా సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు, రాష్ట్రంలో యూట్యూబ్‌ ట్రైనింగ్‌ అకాడెమీ ఏర్పాటుకు గూగుల్‌ సంస్థ ఆసక్తి వ్యక్తం చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. యూట్యూబ్‌ సంస్థ గ్లోబల్‌ సీఈఓ నీల్‌మోహన్, గూగుల్‌ సంస్థ ఆసియా పసిఫిక్‌ విభాగం (ఏపీఏసీ) అధిపతి సంజయ్‌ గుప్తాలతో ఆయన వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు.

రాష్ట్రంలో స్థానిక భాగస్వాములతో కలసి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ, ‘గ్రో విత్‌ గూగుల్‌’ వంటి సర్టిఫికేషన్‌ ప్రోగ్రాంలు నిర్వహించడం వంటి అంశాలపై వారు చర్చించారు. అమరావతిలోని మీడియా సిటీలో యూట్యూబ్‌ కార్యకలాపాలు ప్రారంభించాలని ఈ సందర్భంగా వారిని చంద్రబాబు కోరారు. అయితే ఆయన విజ్ఞప్తిపై వారు సానుకూలంగా స్పందించినట్లు స్వయంగా చంద్రబాబు ‘ఎక్స్‌’ వేదికగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో యూట్యూబ్‌ అకాడెమీ ఏర్పాటు, ఏఐ వినియోగాన్ని ప్రోత్సహించడం, కంటెంట్‌ డెవలప్‌మెంట్, నైపుణ్యాభివృద్ధి, సర్టిఫికేషన్‌ కార్యక్రమాలపై స్థానిక భాగస్వాములతో కలసి పనిచేసేందుకు వారు ఆసక్తి కనబరిచారని తన పోస్టులో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news