ప్రతీ ఒక్కరూ నెలలో ఒక్కసారైనా చేనేత దుస్తులు ధరించండి : సీఎం చంద్రబాబు

-

ప్రతీ ఒక్కరూ నెలలో ఒక్కసారైనా చేనేత దుస్తులు ధరించండి అని  సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. చేనేత దినోత్సవంలో పాల్గొన్న ఆయన అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ వద్ద స్వయంగా సీఎం చంద్రబాబు రెండు చీరలను కొనుగోలు చేశారు. చీరల యొక్క ప్రత్యేకత అడిగి తెలుసుకొని ఈ చీరలను తీసుకున్నారు.

వెంకటగిరి చీర, ఉప్పాడ జాందాని చీరలను సీఎం తీసుకున్నారు.  వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తమ ఉత్పత్తులతో స్టాల్ ఏర్పాటు చేసిన నేతన్నలతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా మాట్లాడారు. వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. స్టాళ్లలో ఉత్పత్తులను పరిశీలించారు. ఉత్పత్తుల గురించి వివరాలు తెలుసుకున్నారు. సుమారు 80కి పైగా స్టాల్స్‌లో చేనేత దుస్తులు ఉంచారు. చేనేత కార్మికులను ప్రోత్సహించే దిశగా ఈ ఎగ్జిబిషన్‌ని ప్రారంభించినట్లుగా సీఎం తెలిపారు. అంతకు ముందు పవన్ కళ్యాణ్ కూడా చేనేత కళాకారులను ప్రోత్సహించాలని.. వారి ఉపాధిని ప్రోత్సహించేందుకు తాను కూడా చేనేత వస్తువులను వినియోగిస్తానని..మీరు కూడా వినియోగించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news