కొత్త నిబంధనలతో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం : హరీశ్ రావు

-

కొత్త నిబంధనలతో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. తెలంగాణ భవన్ లో తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. 90 శాతం స్తానికులకే ఉద్యోగాలు దక్కేలా బీఆర్ఎస్  కృషి చేస్తుంది. 9,10, ఇంటర్ ఎక్కడ చదివితే అక్కడ లోకల్ అంటే.. కొంత మంది విద్యార్థులు చెన్నై వంటి ఇతర రాష్ట్రాల్లో చదువుతారు. వారు కూడా నాన్ లోకలా..? అని ప్రశ్నించారు హరీశ్ రావు. 

ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 33 అసమగ్రంగా ఉంది.  ప్రభుత్వం కనీసం అవగాహాన లేకుండా ఎంబీబీఎస్ విద్యార్థుల కోసం జీవో తీసుకొచ్చింది. మేము గతంలో తీసుకొచ్చిన జీవో తో ఎవ్వరికీ ఇబ్బంది లేదు. కానీ కొత్త నిబంధనలతోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మా హయాంలో 30 వరకు కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని తెలిపారు.  మన తెలంగాణ బిడ్డ.. మన తెలంగాణలో ఎంబీబీఎస్ చేయాలంటే నాన్ లోకల్ అయ్యే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ విధానాలు సరిగ్గా లేవన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news