RBI : కీలక వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే?

-

అందరి అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలక వడ్డీ రేట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా కొనసాగించింది. ఇక రెపోరేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు గురువారం నాడు ఆర్‌బీఐ గవర్నర్‌ అయిన శక్తికాంత దాస్‌ ప్రకటించడం జరిగింది. అయితే ఈ వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులనేవి చేయకపోవడంతో గృహ కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పెరుగుతుందని తెలుస్తుంది.

ఆర్బిఐ తీసుకున్న ఈ తాజా నిర్ణయం ద్వారా గృహ రుణ EMIలు ప్రస్తుతానికి ఫిక్స్డ్ గా ఉంటాయి. దీంతో వినియోగదారులకు ఎటువంటి అదనపు భారం ఉండదని మార్కెట్ వర్గాలు కూడా పేర్కొంటున్నాయి. దీంతో కొత్తగా ఇల్లులు కొనుగోలు చేయాలనుకునే వారు పెరిగి, రియల్ ఎస్టేట్ రంగానికి మంచి రోజులు వస్తాయని రియల్ ఎస్టేట్ డెవలపర్లు కూడా అంచనాలు పెంచుకుంటున్నారు. ప్రస్తుతం దేశంలో ప్రధాన నగరాల్లో గృహలకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ఈ ఫిక్స్డ్ పాలసీ వడ్డీ రేటు ఇల్లు కొనాలనుకునేవారికి సెంటిమెంట్‌కు సపోర్ట్ నిస్తుంది.

అంతేగాక ఇది మరిన్ని పెట్టుబడులకు కూడా ప్రోత్సహిస్తుందని పలువురు నిపుణులు అంటున్నారు. ఇక నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ మాట్లాడుతూ, పాలసీ రేట్లను మార్చకుండా ఉంచాలనే నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన అన్నారు. కొనసాగుతున్న రెసిడెన్షియల్ అమ్మకాలు బాగా పుంజుకుంటాయని, ఇది ఈ రంగం అభివృద్ధికి సహాయపడుతుందని ఆయన చెప్పారు.

ఇక సిగ్నేచర్ గ్లోబల్ (ఇండియా) లిమిటెడ్ వ్యవస్థాపకుడు, చైర్మన్ అయిన ప్రదీప్ అగర్వాల్ మాట్లాడుతూ, ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ఆర్థిక వృద్ధికి సపోర్ట్ ని ఇవ్వడమే కాకుండా గృహ మార్కెట్‌పై విశ్వాసాన్ని బలపరుస్తుందని ఆయన అన్నారు. అలాగే కొత్త వినియోగదారులను కూడా ఈ రంగంలోకి ప్రవేశించడానికి, ఇంకా రియల్ ఎస్టేట్ అమ్మకాల వేగాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందని కూడా ఆయన అన్నారు. అక్టోబర్ పాలసీ సమావేశంలో మార్పు రావచ్చని అంచనా వేశారు. ఇంకా అలాగే డిసెంబర్ నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని కూడా ఆయన అంచనా వేయడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news