రంగారెడ్డిలో దారుణం.. బాలుడి పురుషాంగాన్ని కొరికేసిన వీధి కుక్క..!

-

రంగారెడ్డిలో దారుణం చోటు చేసుకుంది. బాలుడి పురుషాంగాన్ని కొరికివేసింది ఓ వీధి కుక్క. ఈ సంఘటన శుక్ర వారం ఉదయం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా నర్సింగ్ పోలీస్ స్టేషన్ కోకాపేట్ లో రెచ్చిపోయింది ఓ వీధి కుక్క. సబితా నగర్ లో గుడిసెలో పడుకున్న 7 సంవత్సరాల దివ్యాంగ బాలుడి పై విచక్షణారహితంగా దాడి చేసింది.

An angry stray dog ​​in Kokapet, Nursing Police Station

అనంతరం ఆ దివ్యాంగ బాలుడి పురుషాంగాన్ని కొరికి వేసింది వీధి కుక్క. దీంతో ఒక్కసారిగా అరిచాడు ఆ బాలుడు. బాలుడి కేకలు విని గుడిసెలోకి వచ్చారు స్థానికులు. వీధి కుక్కను వెళ్ల గొట్టి బాలుడిని ఆసుపత్రికి తరలించారు. అటు కుక్కకాటు కు మరో బాలుడు మృతి చెందాడు. ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుక్క కాటుతో నాలుగేళ్ల బాబు ( కీయన్స్ ) మృతి చెందాడు. కుక్క దాడి లో తీవ్ర గాయాలు కావడంతో నీలోఫర్ లో ఆస్పత్రి చికిత్స అందించారు. 20 రోజులుగా నీలోఫర్లో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు బాలుడు.

Read more RELATED
Recommended to you

Latest news