గిరిజ‌నులకు చంద్రబాబు శుభవార్త..వారందరికీ ఇండ్లు కటిస్తామని ప్రకటన

-

గిరిజ‌న ఉత్ప‌త్తులను కొనుగోలు చేస్తూ, వారికి మ‌రిన్ని అవ‌కాశాలు ద‌క్కేలా మార్కెటింగ్ చేయాలంటూ సూచ‌న‌లు చేశారు సీఎం చంద్ర‌బాబు. నేడు ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఉన్న తరుణంలోనే… విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివాసి దినోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు హజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా గిరిజన ఉత్పత్తుల స్టాల్స్ తిలకించి, అరకు కాఫీ రుచి చూశారు చంద్రబాబు.

Telugudesam congratulates tribal brothers on the occasion of World Adivasi Day

గిరిజనుల ఉత్పత్తుల స్టాళ్లని పరిశీలించిన సీఎం చంద్రబాబు….గిరిజన తెనే కొనుగోలు చేశారు. ఉత్పత్తి ఎలా చేస్తున్నారు..? మార్కెటింగ్ ఎలా ఉంటుందని గిరిజనులను అడిగి తెలుసుకున్న చంద్రబాబు….గిరిజనుల ఉత్పత్తులకు సరైన బ్రాండింగ్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. సంచార జాతియైన నక్కలోళ్లు చేసిన ఉత్పత్తులను పరిశీలించిన చంద్రబాబు.,,ఆ కుటుంబాల స్థితిగతులపై చంద్రబాబు ఆరా తీశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా నక్కలోళ్లు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించి వాళ్లకు ఇళ్లు కట్టించేలా ప్రతిపాదనలు పంపాలని చంద్రబాబు ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news