తెలంగాణలో ఆగస్టు 31 తరువాత గంజాయి కనిపించదు.. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ కీలక ప్రకటన

-

రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాలు లేకుండా చేయాలని ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేపట్టి డ్రగ్స్, గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా డ్రగ్స్ ని స్వాధీనం చేసుకుంటున్నారు. డ్రగ్స్ ని హైదరాబాద్ నగరానికి తీసుకురావాలంటేనే ప్రస్తుతం భయపడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే గంజాయి నియంత్రణ పై హన్మకొండ కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు.  ఈ సమీక్షలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి, సీపీ అంబర్ కిశోర్ ఝా హాజరయ్యారు. ఈ సందర్భంగా కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆగష్టు 31 తర్వాత తెలంగాణలో గంజాయిని పూర్తిగా నియంత్రిస్తామని ప్రకటించారు. గుడుంబా రహిత రాష్ట్రంగా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో, పట్టణాల్లో బెల్ట్ షాపుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అంతేగాకుండా.. విద్యా సంస్థల్లో మత్తు పదార్థాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో గుట్టుగా సాగుతున్న గంజాయి, డ్రగ్స్ విక్రయాలపై ఎప్పటికప్పుడు పోలీసులు పంజా విసురుతున్నారు. డ్రగ్స్ రహిత తెలంగాణాగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆదేశాలను అధికారుల సాయంతో పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news