మాజీ మంత్రి, వైసీపీలో కీలక నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ చుట్టూ విశాఖజిల్లా రాజకీయం నడుస్తోంది.. ఎమ్మెల్సీ అభ్యర్దిగా ఆయన బరిలోకి దిగినప్పటి నుంచి ఆయన గెలుస్తారా లేదా అనే చర్చ రాజకీయ పార్టీల్లో ఉండేది.. ఇప్పుడు ఈ ఎన్నికకు కూటమి దూరమవ్వడంతో బొత్స గెలుపు లాంఛనంగా మారింది.. రేపో మాపో ఆయన.. ఎమ్మెల్సీ బొత్సగా మారబోతున్నారు.. ఆయన సేవలను పార్టీకి విసృతంగా విని్యోగించుకోవాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారట. అందులో భాగంగానే జగన్ ఓ ఆలోచనలో ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్ లో చర్చ నడుస్తోంది..
బొత్సా ఎమ్మెల్సీగా గెలిస్తే మరో మూడున్నరేళ్ల పాటుగా ఎమ్మెల్సీ గా ఉంటారు.. ఆయన సేవలను వినియోగించుకోవాలంటే.. ఆయనకు మండలిలో సముచిత స్తానం కల్పించాలని జగన్ భావిస్తున్నారట.. ఆయనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని జగన్ భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. మండలిలో వైసీపీకి పూర్తి మెజారిటీ ఉంది. అక్కడ ప్రతిపక్ష నేతగా ప్రస్తుతం లేళ్ల అప్పిరెడ్డి ఉన్నారు.. ఆయన స్థానంలో బొత్స సత్యనారాయణకు ఆ బాధ్యతలు అప్పగించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది..
బొత్స శాసనమండలిలో ఉంటే టీడీపీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తారనే భావనలో అధినేత ఉన్నారట.. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి బొత్స సీనియార్టీ పనికొస్తుందని.. ఆయన సేవలను వినియోగించుకోవాలని పార్టీ భావిస్తోందన్న ప్రచారం జరుగుతోంది.. లేళ్ల అప్పిరెడ్డి మీద పార్టీలో సానుకూలత లేకపోవడం కూడా ఓ కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణకు బంఫర్ ఆఫర్ ఇస్తున్నారనే టాక్ వినిపిస్తోంది..