నేడు హైదరాబాద్​కు జస్టిస్​ పీసీ ఘోష్

-

కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ తదుపరి ప్రక్రియ ఇవాళ్టి నుంచి కొనసాగనుంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ ఇవాళ కోల్‌కతా నుంచి హైదరాబాద్ రానున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో పలువురు అధికారులను విచారించిన విషయం తెలిసిందే.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఉన్నతాధికారులు, విశ్రాంత ఇంజనీర్లను విచారించి వారి నుంచి అఫిడవిట్లు తీసుకున్న కమిషన్ వాటిని పూర్తి స్థాయిలో విశ్లేషించి వాటి ఆధారంగా తదుపరి ప్రక్రియను కొనసాగించనుంది. అఫిడవిట్లలో ఉన్న అంశాలపై బహిరంగ విచారణకు కూడా జస్టిస్ పీసీ ఘోష్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. సాక్ష్యాల నమోదు, క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేపట్టింది. సాంకేతిక అంశాలపై కమిషన్ కసరత్తు దాదాపుగా పూర్తయింది. రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ వి.ప్రకాశ్​తో పాటు అప్పటి ప్రభుత్వ పెద్దలను కూడా కమిషన్ ఎంక్వైరీ కోసం పిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news