కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి రెండు లక్షల రైతు రుణమాఫీ అంటూ రైతులను మోసం చేస్తుండు. అధికారంలోకి రాగానే ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ మొదటి సంతకం చేస్తానన్న వాగ్దానం ఏమైంది అని కొప్పుల ఈశ్వర్ అన్నారు. మూడు దఫాలుగా రుణమాఫీ చేసినట్టే చేసి రైతులను మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. గత BRS ప్రభుత్వంలో కేసీఆర్ 40 లక్షల పైచిలుకు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసిన ఘనత కేసీఆర్ ది.
ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మూడు దఫాలుగా రుణమాఫీ చేసిందని చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి 24 లక్షల మందికి రుణమాఫీ అందినట్లు లెక్కలు చెబుతున్నాయి. రైతు రుణమాఫీ గురించి ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి కి మంత్రులకు పొంతన లేని లెక్కలు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రైతు భరోసా సంవత్సరానికి 15000 ఇస్తానన్న వాగ్దానం ఏమైంది రైతు కూలీలకు 12,000 ఇస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది . రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా రైతు కూలీలకు ఇచ్చే డబ్బులను రైతు రుణమాఫీ కి మళ్లించి రైతులను కౌలు రైతులను కూలీలను మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డిది అని కొప్పుల ఈశ్వర్ అన్నారు.