న్యూఢిల్లీలో ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యంగ్ లియును కలిసినందుకు ఆనందంగా ఉందని.. చాలా విజయవంతంగా చర్చలు జరిగాయని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా ఆయన ట్వీట్ లో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ప్రపంచ గుర్తింపుతో తెలంగాణను తయారీ కేంద్రంగా అభివృద్ధి చేసే వ్యూహంలో భాగంగా.. హైదరాబాద్‌లో అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీలో కొత్త సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ తయారీదారులలో ఒకటైన ఫాక్స్‌కాన్‌ను ఆహ్వానించింది.
మా ప్రతిష్టాత్మక ప్రణాళికలు త్వరితగతిన విజయవంతం అయ్యేలా చూసుకోవడానికి రెండు ప్రతినిధి బృందాలు క్రమం తప్పకుండా పరస్పరం సంభాషించడాన్ని కొనసాగిస్తాయి. ఛైర్మన్ యంగ్ లియు త్వరలో హైదరాబాద్‌ను సందర్శిస్తారు. అదేవిధంగా త్వరలో మనందరితో పంచుకోవడానికి చాలా ఉత్తేజకరమైన, శుభ వార్తలు ఉంటాయి అని ట్వీట్ లో వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి.