అయ్యో పాపం.. వాగులో కొట్టుకుపోయిన ఉపాధ్యాయులు

-

వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.. ఇటువైపు రావొద్దు.. అని స్థానికులు చెబుతున్నా తెలుగు అర్థం కాకపోవడంతో వాగులో ముందుకెళ్లడంతో ప్రవాహానికి కొట్టుకుపోయారు ఇద్దరు ఉపాధ్యాయులు. ఈ ఘటనలో ఉపాధ్యాయిని మృతి చెందగా, మరొకరి ఆచూకీ గల్లంతైంది. ఈ విషాద ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..  పాచిపెంట మండలంలోని కొటికిపెంటలో ఏకలవ్య పాఠశాలలో వసతి సరిపోకపోవడంతో సరాయివలస గ్రామంలోని ఆశ్రమ పాఠశాలలో తరగతులు నిర్వహిస్తున్నారు. హర్యానాకు  చెందిన ఆర్తి (23), మహేశ్‌ ఇక్కడ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు.  వీరు గురివినాయుడుపేటలో ఉంటారు. రోజూ మాదిరిగానే విధులు ముగించుకొని శుక్రవారం రోజున ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలోని రాయిమాను వాగు పొంగి ప్రవహిస్తుండటంతో నీరు కాజ్‌వేపైకి చేరింది.

స్థానికులు వీరిని గమనించి, వెనక్కి వెళ్లిపోవాలని అరిచినా..  భాష అర్థంకాక ఆ ఇద్దరూ ముందుకు రావడంతో వారిద్దరూ కొట్టుకుపోయారు. ఈ ఘటనలో ఆర్తి మరణించగా.. మహేశ్ గల్లంతయ్యారు. అతడి కోసం అధికారులు గాలిస్తున్నారు. కాజ్‌వే శిథిలమైందని, బాగు చేయాలని ప్రజాప్రతినిధులను ఎన్నిసార్లు వేడుకున్నా పట్టించుకోలేదని స్థానికులు వాపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news