బంజారా హిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు రోడ్డు ప్రమాదం..!

-

ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ రోడ్డు ప్రమాదం. చోటు చేసుకుంది. ఖైరతాబాద్ నుంచి బంజారా హిల్స్ వైపు అతి వేగంతో వెళ్తూ డివైడర్ ను ఢీ కొట్టింగ్ కొత్త BMW కారు. ఈ ప్రమాద సమయంలో కారులో ఇద్దరు యువతులు, ఇద్దరు యువకులు ఉన్నట్లు తెలుస్తుంది . అందులో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రికి వారిని తరలించారు.

అయితే బంజారా హిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో కారును జితేష్ బుగాని అనే యువకుడు నడుపుతున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. అయితే జితేష్ బుగాని తండ్రి ఓ ఉన్నతాధికారి అని తెలుస్తుంది. ఇక ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఖైరతాబాద్ పోలీసులు. మద్యం మత్తులో కారు ప్రమాదం జరిగిందా లేదా నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందా అని ఆరా తీస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news