రష్యాలో భారీ భూకంపం.. బద్దలైన షివేలుచ్ అగ్నిపర్వతం

-

రష్యాలో భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 5.25 గంటలకు కంచట్కా ద్వీపకల్పంలో 7.0 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో 50 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి పెద్దగా ఆస్తి నష్టం ఏం జరగలేదని స్థానిక అధికారులు వెల్లడించారు.

అయితే భూకంపం ధాటికి పెట్రో పవ్‌లావ్‌స్కీ-కమ్‌ చట్‌స్కీకి 280 మైళ్ల దూరంలో ఉన్న షివేలుచ్ అగ్నిపర్వతం బద్దలైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. సుమారు 8 కిలోమీటర్ల ఎత్తువరకు లావాను వెదజల్లుతున్నట్లు తెలిపారు. దీంతో సమీపంలో ఉన్న ప్రాంతాలు మొత్తం కాలి బూడిదయ్యాయి.

మరోవైపు భారీ భూకంపం నేపథ్యంలో హొనులులు లోని యూఎస్ నేషనల్ సర్వీస్‌కు చెందిన పసిఫిక్ సునామా హెచ్చరిక కేంద్రం తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే కొద్ది సేపటి తర్వాత సునామా హెచ్చరికలను ఉపసంహరించుకున్నట్లు తూర్పు తీర ప్రాంత నగరమైన పెట్రోపవ్‌లావ్‌స్కీ-కమ్‌ చట్‌స్కీకి 102 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news