Tax Notice: ఐటీఆర్ ఫైల్ చేసిన వాళ్లకు సెక్షన్ 143 నోటీసులు.. మీకూ వస్తే ఏం చేయాలి..?

-

Tax Notice: ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన వాళ్లంతా రిఫండ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఐటీఆర్ రిటర్న్స్ ఫైల్ చేసి, దానిని వెరిఫై చేస్తేనే ఐటి శాఖ ప్రాసెసింగ్ చేస్తుంది. రిటర్న్స్ దాఖలు చేసిన తర్వాత 30 రోజుల పాటు సమయం ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ ప్రాసెస్ పూర్తి చేసినట్లయితే అందుకు సంబంధించిన టాక్స్ పేయర్లకు సమాచార నోటీసులని పంపిస్తుంది. 1961 లోని సెక్షన్ 143 (1) కింద నోటీసుల్ని అందిస్తుంది. టాక్స్ విభాగం దగ్గర రిజిస్టర్ చేసిన ఈమెయిల్ అడ్రస్ కి నోటీసులు పంపిస్తుంది. అదనంగా టాక్స్ పేయర్లకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి ఎస్ఎంఎస్ కూడా పంపిస్తుంది.

రిఫండ్ కు సంబంధించిన వివరాలు ఈ నోటీసుల్లో ఉంటాయి మీకు ఈ నోటీస్ వచ్చిందా వస్తే ఏం చేయాలి అనే దాని గురించి చూద్దాం.. ITR లో మీరు ఇచ్చిన సమాచారం ఐటి శాఖ వద్ద ఉన్న సమాచారం సరిపోలిందా లేదా టాక్స్ బకాయిలు ఉన్నాయా అనేది అక్కడ మీరు చూడొచ్చు. ఆ వివరాల్లో అన్ని క్లియర్గా ఉంటాయి. ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ లో తప్పులు గుర్తించినట్లయితే… 143 కింద నోటీసులు ఇస్తుంది. తప్పుల్ని సరిచేయాలని అంటుంది మీరు ఫైల్స్ చేసిన ఐటీఆర్ ఆమోదించాలా లేదా రిజెక్ట్ చేయాలని నిర్ణయం తీసుకోవాలని ఈ నోటీసు ద్వారా హెచ్చరిస్తుంది. పొరపాటులను సరిచేసుకునేందుకు లభించిన ఒక అవకాశం ఇది అని చెప్పొచ్చు. సెక్షన్ 143 కింద నోటీసుల్ని పంపించేందుకు టైం లిమిట్ ని మూడు నెలలు పొడిగించింది.

ఐటిఆర్ ఫైల్ చేసిన ఏడాది ముగిసిన తర్వాత తొమ్మిది నెలల వరకు ఈ సెక్షన్ కింద నోటీసుల్ని పంపిస్తుంది. 2023-24 కోసం ఐటిఆర్ దాఖలు చూస్తే డిసెంబర్ 31, 2025 వరకు మీకు నోటీసులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. నోటీసులో పేర్కొన్న వివరాలను పూర్తిగా చదివి అర్థం చేసుకుని సూచించిన అంశాలకు తగిన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది కావలసిన డాక్యుమెంట్లని మీరు రెడీ పెట్టుకోవాలి. తప్పులు ఉన్నాయని సూచిస్తే వాటిని సరిచేసుకోవాలి. నిర్దేశించిన సమయంలోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలి. ఈ ఫైలింగ్ పోర్టల్ ద్వారా లేదంటే నేరుగా ఆఫీసుకు వెళ్లి రిప్లై ఇవ్వడానికి అవుతుంది. సంబంధించిన కాపీని ప్రూఫ్స్ ని మీ దగ్గర పెట్టుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news