Tirumala: తిరుమల శ్రీవారి సన్నధిలో కలకలం నెలకొంది. తిరుమల శ్రీవారి మెట్టు నడక మార్గంలో ప్రేమజంట ఆత్మాహత్యాయత్నం చేసుకుంది. ఈ సంఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీవారి మెట్టు నడక మార్గంలో ప్రేమజంట ఆత్మాహత్యాయత్నం చేసుకుంది. ఆత్మాహత్యాయత్నం చేసుకున్న వారిని చిత్తూరు టౌన్, బంగారురెడ్డి పల్లెకు చెందిన సతీష్ , రాధిక లుగా గుర్తించారు.
తిరుమలలోని 450వ మెట్టు దగ్గర పురుగుల మందు తాగింది ప్రేమజంట. అయితే.. వెంటనే భక్తులు గుర్తించి టీడీపీ సెక్యూరిటీకి సమాచారం ఇచ్చారు. దీంతో కిందకు దించి 108 వాహనంలో రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రియుడు బంగారురెడ్డి పల్లెకు చెందిన సతీష్ పరిస్థితి విషమం గా ఉంది. మూడు రోజుల క్రితం ఇళ్లు వదిలి వచ్చినట్లు చెబుతోంది ప్రియురాలు రాధిక. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.