విశాఖలో మ్యాట్రిమోనీ పేరుతో మోసం చేస్తున్నారు. విశాఖలో మ్యాట్రిమోనీ సైట్లో అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టి ఘరానా మోసం చేస్తున్నారు. ఈ తరుణంలోనే విశాఖ యువకుడి దగ్గర 46 లక్షలు స్వాహా అనిపించారు కేటుగాళ్లు. ప్రొఫైల్ బాగుందని టచ్ లోకి వెళితే ట్రాప్ చేస్తోంది సైబర్ గ్యాంగ్. అందమైన అమ్మాయి తో పెళ్ళి మోజులో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ లో దిగాడు విశాఖకు చెందిన సాప్ట్ వేర్ ఇంజనీర్.
ఈ తరుణంలోనే 46 లక్షలు పోగొట్టుకున్న తర్వాత సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాలు సమకూరుస్తున్న పశ్చిమ బెంగాల్ కు చెందిన ఆదిత్య పాత్రా అరెస్టు కూడా అయ్యాడు. ఆదిత్య పాత్ర పై వివిధ రాష్ట్రాలలో 106 కేసులు ఉన్నాయి. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.