Gratuity Rule : ఎన్నేళ్ల తర్వాత ఉద్యోగికి కంపెనీ నుంచి గ్రాట్యుటీ వస్తుంది..? తక్కువ కాలం పని చేస్తే రాదా..?

-

Gratuity Rule: చాలామందికి గ్రాట్యూటీ కి సంబంధించి సందేహాలు ఉన్నాయి. ఎప్పుడు గ్రాడ్యుటి వస్తుంది అనే దాని గురించి అనుమానాలు ఉన్నాయి. సంస్థలో ఐదేళ్ల కంటే తక్కువ పని చేసినా కూడా గ్రాడ్యుటి తీసుకోవచ్చా అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకే సంస్థలో లేదా కంపెనీలో ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పని చేసి ఆ తర్వాత జాబ్ మానేసి వెళ్తున్న వారికి సదరు కంపెనీ ఇచ్చే మొత్తాన్ని గ్రాట్యూటీ అని అంటారు. దీనికి కచ్చితంగా ఐదేళ్లు వరుసగా పని చెయ్యాలా లేకపోతే తక్కువ కాలం పని చేసినా వాళ్ళు కూడా గ్రాట్యూటీని పొందవచ్చా అనేది కూడా తెలుసుకుందాం.

 

1972 గ్రాట్యూటీ ప్రకారం.. నిరంతరాయంగా ఒకే సంస్థలో ఐదేళ్ల కంటే తక్కువ పని చేసినా కూడా ఆ ఉద్యోగి గ్రాట్యుటీ పొందవచ్చు. నాలుగేళ్ల ఎనిమిది నెలలు లేదా అంతకంటే తక్కువ కాలం పని చేసిన ఉద్యోగులు కూడా అర్హులు. గ్రాట్యూటీ యాక్ట్ 1972 ప్రకారం చూసినట్లయితే ఉద్యోగి స్వచ్ఛంద నిష్క్రమణకు మాత్రమే గ్రాడ్యుటి పరిమితం కాదని తెలుసుకోవచ్చు.

ఉద్యోగి చనిపోయిన సందర్భంలో కూడా సదరు యజమాన్యం గ్రాట్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రమాదాలు, అస్వస్థ కారణంగా పని చేయలేని పరిస్థితి ఉంటే కూడా గ్రాట్యుటీని చేసుకోవచ్చు. రిటైర్మెంట్ సమయంలో కూడా ఉద్యోగులు తాము పని చేస్తున్న సంస్థ నుంచి గ్రాడ్యుటిని పొందవచ్చు. ఐదేళ్ల కాలం పని చేయాలన్న నిబంధన ఉండదు. ఇలా కొన్ని సందర్భాల్లో ఐదేళ్లు పూర్తి అవ్వాలని నిబంధన వర్తించదు.

Read more RELATED
Recommended to you

Latest news