మహిళా కమిషన్ ముందు హాజరై తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు కేటీఆర్. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను యధాలాపంగా మాట్లాడిన మాట పట్ల విచారం వ్యక్తం చేశానని మహిళ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాను. చట్టాన్ని, మహిళలను గౌరవించే వ్యక్తిగా నేను మాట దొర్లటం పై క్షమాపణ అడిగాను. చట్టాన్ని గౌరవిస్తూ మేము కమిషన్ ముందు వస్తే, మహిళ కాంగ్రెస్ నేతలు మా నాయకులపై దాడి చేశారు. మహిళలను గౌరవించాలనే ఉద్దేశంతో మేము వస్తే ఇలాంటి దాడి చేయటం సరికాదు.
8 నెలల్లో మహిళలపై జరిగిన సంఘటనలను వారికి చెప్పే ప్రయత్నం చేశాను. అన్ని వివరాలతో నేను వచ్చాను. మళ్లీ రావాలని కమిషన్ చెప్పటం జరిగింది. వారిని గౌరవిస్తూ మళ్లీ వస్తామని తెలిపారు. కానీ మా నాయకురాళ్లపై జరిగిన దాడి పై కూడా మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలి.. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలో కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్టు తెలిపారు మంత్రి కేటీఆర్.